Header Banner

అప్పటికి నా చేతిలో 14 సినిమాలు.. ఇదంతా వారి చలవే! తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి..

  Sat Mar 08, 2025 19:34        Entertainment

రాజేంద్రప్రసాద్ .. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు తెరపై హాస్యాన్ని పరిగెత్తించిన కథానాయకుడు. అప్పుడు హీరోగా ఆయన ఎంత బిజీగా ఉండేవారో .. ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగా అంతే బిజీగా ఉన్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. "నేను నిమ్మకూరులో రామారావుగారి ఇంట్లో పుట్టాను. నన్ను ముందుగా చేతుల్లోకి తీసుకున్నది రామారావుగారి తల్లిగారే. అక్కడే పెరగడం వలన రామారావుగారితో మంచి సాన్నిహిత్యం ఉండేది. పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు ఆయనను కలిసి వెళుతూ ఉండేవారు. అయితే అప్పటికి నేను చాలా సన్నగా .. పీలగా ఉండటం వలన నన్ను ఆర్టిస్టును చేయాలనే ఆలోచన ఎవరూ చేయలేదు" అని అన్నారు. "అనుకోకుండా నేను 'రామ రాజ్యంలో భీమరాజు' చేశాను. 'ఈ కుర్రాడు ఎవరో చాలా బాగా చేస్తున్నాడయ్యా' అంటూ అక్కడే అందరి ముందు కృష్ణగారు మెచ్చుకున్నారు. అప్పటికప్పుడే తాను చేస్తున్న మిగతా సినిమాలలో నాకు అవకాశం ఇప్పించారు. ఆ సినిమా విడుదల కాగానే నన్ను ఇంటికి పిలిపించి అభినందించారు. అప్పటికి నా చేతిలో 14 సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారు ..  కృష్ణగారు ఇండస్ట్రీలో ఉండగా నేను రావడం, నా అదృష్టంగానే భావిస్తుంటాను .. ఇదంతా వారి చలవే" అని చెప్పారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #KinjarapuRamMohanNaidu #Guntur #Pressmeet #AndhraPradesh